నన్ను భయపెట్టాలని ఆజంఖాన్ చూస్తున్నారు: జయప్రద

నన్ను భయపెట్టాలని ఆజంఖాన్ చూస్తున్నారు: జయప్రద
x
Highlights

బీజేపీ నేత, సినీ నటి జయప్రదపై సమాజ్ వాదీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ నేతలంతా ఆజంఖాన్ వ్యాఖ్యలను...

బీజేపీ నేత, సినీ నటి జయప్రదపై సమాజ్ వాదీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ నేతలంతా ఆజంఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. జయప్రదను అండగా నిలుస్తున్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మహిళపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్పీ నాయకులు మౌనంగా ఉండిపోయారని ఆమె అన్నారు.

ఆజంఖాన్‌ విషయంపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు ఘాటుగా స్పందించారు. ఆజంఖాన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఆజంఖాన్‌పై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాంపూర్‌ బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసిన అజాంఖాన్ పై ఎన్నికల కమిషన్ కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ డిమాండు చేశారు. ఈ మేర కేంద్ర ఎన్నికల కమిషన్ కు రేఖాశర్మ లేఖ రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories