విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం

Submitted by arun on Sat, 09/01/2018 - 17:38

విద్యుత్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఘన విజయం సాధించింది విద్యుత్ రంగంలోనే అని సీఎం తెలిపారు. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసి మరింత అభివృద్ధి సాధించాలని సీఎం అన్నారు. విద్యుత్‌ను పొరుగు రాష్ర్టాలకు అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు సీఎం. ఇప్పటికే రూ. 250 కోట్ల విలువైన విద్యుత్‌ను విక్రయించామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ అనేది కేంద్రం పరిధిలో ఉందన్నారు. వివాదంలో ఉన్న సీపీఎస్‌ను కూడా పరిష్కరించే దిశగా చర్చిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

English Title
KCR Gift to Telangana Electricity Employees | 35% PRC Hiked

MORE FROM AUTHOR

RELATED ARTICLES