నైరుతి ముందుగానే మురిపించనుంది!

నైరుతి ముందుగానే మురిపించనుంది!
x
Highlights

అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్ని పలకరించే చాన్సు ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అనుకున్న సమయం కన్నా తొందరగానే ఇవి...

అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్ని పలకరించే చాన్సు ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అనుకున్న సమయం కన్నా తొందరగానే ఇవి శనివారం అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోకి అడుగుపెట్టినట్లు చెప్పింది. మరో నాలుగు రోజుల్లో ఇవి బంగాళాఖాతం లో మిగిలిన ప్రాంతాలలోకి విస్తరించే అవకాశం కనిపిస్తోందని తెలిపింది. నివారం వాతావరణశాఖ నివేదికలో చెప్పినదాన్ని బట్టి.. గడచిన 48గంటల్లో నికోబార్‌ దీవుల్లో విస్తృతంగా వర్షాలు పడ్డాయని తెలిపారు. రానున్న 3 రోజుల్లో అక్కడ మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెల 22 వరకు అండమాన్‌ సముద్రం, అక్కడి దీవుల్లో బలమైన గాలులు వీస్తాయని, ఫలితంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలను తాకే అవకాశం ఉందని అంచనాలు కడుతున్నారు. కోస్తా, రాయలసీమల్లో ఆదివారం కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడతాయని, గాలి వేగం గంటకు 40-50కి.మీ వరకూ ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎండలతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి ఈ వార్త ఉపశమనాన్ని కలిగించేదే.

Show Full Article
Print Article
Next Story
More Stories