చూశారా.. హరీష్ ను తండ్రీకొడుకులు పొగిడేస్తున్నారు

Submitted by lakshman on Thu, 03/15/2018 - 17:42
 kcr and ktr Compliments on minister harish rao

తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆరే. కానీ.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరూ.. అన్న ప్రశ్న వస్తే మాత్రం కేటీఆర్ అన్న సమాధానం ఠక్కున రావడమే కాదు. ఆ వెంటనే మరి హరీష్ రావు.. అన్న సమాధానం లేని ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంటుంది. అందుకే.. హరీష్ కాంగ్రెస్ లోకి చేరతారని ఓసారి.. బీజేపీలోకి వెళ్తారని మరోసారి కూడా గుసగుసలు వినిపించాయి. తర్వాత.. తన పుట్టుకా చావూ టీఆర్ఎస్ లోనే అని హరీష్ చెప్పడంతో.. ప్రస్తుతానికి ఆ చర్చకు తాత్కాలిక ఫుల్ స్టాప్ పడింది.

కానీ.. హరీష్ ఇలా తాను పార్టీ మారేది లేదూ.. అని చెప్పిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల శైలి కాస్త మారిపోయినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ హరీష్ ను బహిరంగంగా.. అంటే అందరూ చూస్తుండగా అంతగా పొగడని ఈ ఇద్దరూ.. సడన్ గా ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. ఎందుకా.. అన్న ఆలోచన వస్తోంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడుతూ హరీష్ రావు గురించి సీఎం కేసీఆర్ మెచ్చుకోలు మాటలు మాట్లాడారు.

అలాగే.. రైతు సమన్వయ సమితుల రాష్ట్ర స్థాయి బాధ్యుడిగా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నపుడు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయతో హరీష్ రావు సారథ్యంలో చెరువులు బ్రహ్మాండంగా బాగు పడుతున్నాయంటూ ప్రశంసలు కురిపించారు. సందర్భం వచ్చింది కాబట్టే ఇలా ప్రశంసలు కురిపించారని అనుకున్నా.. ఆఫ్ ద రికార్డ్ గా ఇంకేమైనా ఉద్దేశం ఉంటుందా.. అన్న అభిప్రాయాలు కూడా జనం నుంచి వినిపిస్తున్నాయి.

English Title
kcr and ktr Compliments on minister harish rao

MORE FROM AUTHOR

RELATED ARTICLES