ఇకపై నేను నివసించేది ఇక్కడే : కత్తి మహేష్

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 13:39
katthi mahesh residence is now in vijayawada

ఇటీవల హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై.. కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  తమ దేవుడిని కించపరుస్తావా అంటూ ఆయనపై మండిపడ్డారు  
హిందువులు. ఈ క్రమంలో హిందువుల పట్ల కత్తి మాహేష్ వ్యాఖ్యలకు నిరసనగా  పరిపూర్ణానంద స్వామిజి ధర్మాగ్రహ యాత్ర చేపట్టారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందన్న కారణంతో స్వామిజి, కత్తి మహేష్ పై హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు పోలీసులు. అయితే ఈ కేసులో స్వామీజీకి ఊరట లభించింది. కత్తి మహేష్ కొంతకాలంగా ఆయన బెంగుళూరులోనే ఉన్నారు. ఈరోజు(సోమవారం) గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కత్తి మహేష్ మీడియాతో మాట్లాడారు. తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తినేనని... తనపై హైదరాబాదు సిటీ నిషేధం మాత్రమే ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో కాకుండా ఇంకా ఎక్కడైనా నివసించవచ్చని... తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వాడిని కాబట్టి ఇక నుంచి విజయవాడలో ఉండేందుకు గన్నవరం వచ్చానని తెలిపారు. 

English Title
katthi mahesh residence is now in vijayawada

MORE FROM AUTHOR

RELATED ARTICLES