అనుష్క ‘భాగమతి’పై కత్తి మహేశ్ రివ్యూ

అనుష్క ‘భాగమతి’పై కత్తి మహేశ్ రివ్యూ
x
Highlights

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా భాగమతి. పిల్ల జమీందార్ మూవీకి దర్శకత్వం వహించిన అశోక్ ఈ సినిమాను రూపొందించారు. అనుష్క లీడ్ రోల్ పోషించిన...

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా భాగమతి. పిల్ల జమీందార్ మూవీకి దర్శకత్వం వహించిన అశోక్ ఈ సినిమాను రూపొందించారు. అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ స్పందన రావడంతో చిత్ర యూనిట్ సంబరాలకు సిద్ధమైంది. భాగమతి సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ కూడా రివ్యూ ఇచ్చాడు. భాగమతి సినిమా హారర్‌తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్ అని ట్వీట్ చేశాడు. అనుష్క తన పాత్రలకు న్యాయం చేసిందన్నాడు. జయరామ్, ఆషాశరత్ సరికొత్తగా కనిపించారని చెప్పాడు. మాధీ సినిమాటోగ్రఫీ, రవీందర్ ఆర్ట్, తమన్ సంగీతం, అశోక్ దర్శకత్వంతో సినిమా బాగా వచ్చిందన్నాడు. మొత్తం మీద భాగమతి సినిమాపై కత్తి మహేశ్ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories