‘తొలిప్రేమ’పై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Sat, 02/10/2018 - 12:30
kathi mahesh

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. టైటిల్‌తోనే అంచనాలను మరింత పెంచిన ఈ సినిమా శనివారం విడుదలైంది. తొలిప్రేమపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు. తెలుగులో ఇప్పట్లో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి అని కత్తి మహేశ్ చెప్పాడు. బ్రిలియంట్ రైటింగ్ అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. హీరోహీరోయిన్లు, ఇతర నటులు ఆకట్టుకునే విధంగా నటించారని కత్తి చెప్పాడు. మణిరత్నం, శేఖర్‌కమ్ముల స్టైల్‌ను కలగలిపితే వెంకీ అట్లూరి అని దర్శకుడిని కత్తి మహేశ్ ఆకాశానికెత్తాడు. చూసి ఆనందించదగ్గ చిత్రం తొలిప్రేమ అని కత్తి మహేశ్ తేల్చి చెప్పేశాడు.

English Title
kathi mahesh Review on Tholi Prema

MORE FROM AUTHOR

RELATED ARTICLES