‘గాయత్రి’ సినిమాపై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Fri, 02/09/2018 - 17:32
 Gayatri

మోహన్‌బాబు నుంచి ఫుల్ లెంగ్త్ రోల్ మూవీ రాక చాలా రోజులే అవుతోంది. ఒకప్పుడు కలెక్షన్స్ కు..అదిరిపోయే డైలాగ్స్ కు కేరాఫ్ గా మారిన మోహన్ బాబు, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ గాయత్రి సినిమా చేశాడు. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినూత్న కథతో వచ్చిన గాయత్రి సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. గాయత్రిలో మోహన్ బాబు మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. టూ డిఫరెంట్ క్యారెక్టర్ లో అదరగొట్టేశాడు. మోహన్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు. ఆసక్తికరమైన పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు దాన్ని ఆకట్టుకునే సినిమాగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని చెప్పాడు. డబ్బు తీసుకుని మరొకరిలా నటించేందుకు హీరో జైలుకెళతాడని కత్తి చెప్పుకొచ్చాడు. అలా వెళ్లిన వ్యక్తి జీవితంలోని ప్రేమ, అతనికి ఎదురయ్యే కష్టనష్టాలు.. అలాంటి ఎన్నో మలుపుల మధ్య తిరిగి అతని కథ ఎలా సుఖాంతమైందనే సినిమా స్టోరీగా చెప్పాడు. అయితే కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ భావోద్వేగాలు కనిపించలేదని.. అనవసర ట్విస్ట్‌లతో సినిమా ఆకట్టుకోలేకపోయిందని కత్తి మహేశ్ తెలిపాడు. మోహన్‌బాబు, నిఖిలా విమల్ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాడు. ఈ సినిమాలో శ్రియ నటించడం వృధా అని కత్తి అభిప్రాయపడ్డాడు.

English Title
kathi mahesh review on movie gayatri

MORE FROM AUTHOR

RELATED ARTICLES