మధ్యాహ్నం 3గంటలకు పోలింగ్‌ శాతాలివే..

మధ్యాహ్నం 3గంటలకు పోలింగ్‌ శాతాలివే..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా,...

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, పుదుచ్చేరి, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో పోలింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల పోలింగ్‌లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం మందకొడిగా పోలింగ్‌ ప్రారంభమైనప్పటికీ క్రమంగా పోలింగ్‌ శాతాలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 3గంటల సమయానికి పలుచోట్ల నమోదైన పోలింగ్‌ వివరాలు చూస్తే ఉత్తర్‌ప్రదేశ్‌ 50.39 శాతం, కర్ణాటక 49.25శాతం,పశ్చిమ్‌ బంగ 60శాతం, బిహార్‌ 49.25శాతం, అసోం60.38శాతం, ఛత్తీస్‌గఢ్‌ 59.25శాతం, తమిళనాడు47.57శాతం, మహారాష్ట్ర49.5శాతం, మణిపూర్‌ 68.75శాతం, కశ్మీర్‌ 38.5శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories