తీవ్ర తుపానుగా ఫణి... 30న దక్షిణ కోస్తావైపు రాక... అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

తీవ్ర తుపానుగా ఫణి... 30న దక్షిణ కోస్తావైపు రాక... అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..
x
Highlights

మండే ఎండల్లో ఫణి తుపాను కోస్తాంధ్రను వణికిస్తోంది. ఇది మరి కొద్ది గంటల్లో తీవ్ర తుసానుగా మారి రేపటికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ...

మండే ఎండల్లో ఫణి తుపాను కోస్తాంధ్రను వణికిస్తోంది. ఇది మరి కొద్ది గంటల్లో తీవ్ర తుసానుగా మారి రేపటికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మే 2 వరకు ..అంటే నాలుగు రోజుల పాటు ఫణి అతి తీవ్ర తుపానుగా కొనసాగవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఫణి తుపాను మచిలీపట్నం, చెన్నై మధ్య కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఈ తుపాను బంగాళాఖాతంలో 15 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగానూ మరో 24 గంటల్లో మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.

ఈ నెల 30న తుపాను దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఫణి తుపాను తమిళనాడు , కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి ఆ తర్వాత బంగ్లాదేశ్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. మే ఒకటో తేదీ నుంచి నాల్గో తేదీ వరకు ..అంటే నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట 200 నుంచి 300 కి.మీ.దూరంలో ప్రయాణించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత ఒడిశా తీరానికి కాస్త దగ్గరగా వెళ్లి బంగ్లాదేశ్‌ వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం తుపాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల తీవ్రత రేపటికి 145 నుంచి 170 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. పెను గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, పుదుచ్చేరిలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఫణి తుపాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

ఫణి తుపాను కారణంగాఈ నెల రేపు ఎల్లుండి కేరళలో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ..తమిళనాడు, కోస్తాంధ్రలో ఏప్రిల్‌ 30, మే 1న పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుపాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెబుతున్నారు. ఈ వేగం 90-115కిలోమీటర్లకు పెరుగుతుందని తెలిపారు. ఈ నెల 29నాటికి 145 నుంచి 170కిలోమీటర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ గాలుల ప్రభావం 30వ తేదీ రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంగా వేగం తగ్గుతుందని చెబుతున్నారు. మే 2వ తేదీకి ఏపీ తీరంలో గాలుల వేగం గంటకు 125-150 కి.మీ.ఉండే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఫణి తుపాను ప్రభావం కనిపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. నెల్లూరు తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తూపిలిపాలెం, కొత్త కోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంట తదితర తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఫణి తుపాను నేపథ్యంలో మత్స్యకారులు, పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లినవారు..ఇవాళ సాయంత్రంలోపు తీరానికి వచ్చేయాలని హెచ్చరించారు. ఫణి తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండు నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ‌్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో తీరప్రాంత వాసుల్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫణి తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories