రాత్రి మందుకొట్టి పడుకున్నాడు.. పొద్దున లేచేసేరికి మర్మాంగం మాయం..

రాత్రి మందుకొట్టి పడుకున్నాడు.. పొద్దున లేచేసేరికి మర్మాంగం మాయం..
x
Highlights

చైనాలో దారుణం చోటుచేకుంది. టాన్ఓ నాన్ అనే ఓ 44 ఏళ్ల వ్యక్తి తన దోస్తులతో కలిసి మందు దావత్ చేసుకున్నాడు. అప్పటికే టాన్ఓ నాన్ ఫుల్‌గా మందుకొట్టాడు...

చైనాలో దారుణం చోటుచేకుంది. టాన్ఓ నాన్ అనే ఓ 44 ఏళ్ల వ్యక్తి తన దోస్తులతో కలిసి మందు దావత్ చేసుకున్నాడు. అప్పటికే టాన్ఓ నాన్ ఫుల్‌గా మందుకొట్టాడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక దావత్ మొత్తం అయిపోయాక తన దోస్తులు దగ్గరుండి టాన్ఓ నాన్‌ను తన ఇంటి వద్దకు చేర్చారు. టాన్ఓ నాన్‌ పీకలదాక తాగి ఉండటంతో మత్తులో అలానే మంచంపై నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఇప్పటి వరకు మంచిగానే ఉందికాని ఇక తెల్లవారుజామున లేచేవరకు తనకు ఉహించని షాక్ తగిలింది. తన మర్మాంగం వద్ద తీవ్ర నొప్పి రావడంతో ఓక్కసారి చూసుకున్న టాన్ఓ నాన్‌ కంగుతిన్నాడు. ఎందుకంటే అతని మర్మాంగం అక్కడ లేదు. తీవ్రరక్తం మాత్రం బయటకు వస్తోంది. అయితే అటు ఇటు చూసేవరకు తన మంచం పక్కనే తన మర్మాంగం పడి ఉండటం కనిపించింది. దీంతో హుటాహుటినా టాన్ఓ నాన్‌ కిందపడి ఉన్న మర్మాంగాన్ని తీసుకొని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతని శస్త్రచికిత్సకు కావలసిన పరికరాలు తమ వద్ద టాన్ఓ నాన్‌ను వెనక్కి పంపిచారు. అలా తన మర్మాంగాన్ని పట్టుకొని చాలా హాస్పిటల్స్ తిరిగాడు చివరకు చంగ్‌షా హాస్పిటల్‌లోని నిపుణులైన వైద్యులు ఆపరేషన్ చేసి అతని మర్మాగాన్ని తిరిగి టాన్‌కు అతికించారు. అయితే ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, ఇలా చేసినవాళ్లు ఎందుకు చేశారో కూడా అర్థం కావడం లేదని టాన్ చెప్పాడు. ప్రస్తుతం టాన్ఓ నాన్‌ను ఆస్పత్రిలోనే ఉన్నాడని, మెళ్లిగా కోలుకుంటాడని వైద్యులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories