ఫైబర్‌ రైస్‌తో షుగర్‌ వ్యాధికి చెక్‌!

ఫైబర్‌ రైస్‌తో షుగర్‌ వ్యాధికి చెక్‌!
x
Highlights

బ్లడ్ షుగర్, మధుమేహం లాంటి వ్యాధులు ఇటీవల మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ...

బ్లడ్ షుగర్, మధుమేహం లాంటి వ్యాధులు ఇటీవల మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. దీనికి ఆహారంలో మార్పులు, నిద్రలేమి, పని ఒత్తిడి అనేవి హైపర్‌ టెన్షన్‌కు కారణమవుతున్నాయని జర్మనీలోని మ్యూనిచ్‌ టెక్నికల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.మన దేశంలో 98 శాతం ప్రజలు పాలిష్‌ చేసిన బియ్యంను వాడుతున్నారు. బియ్యానికి పాలిష్‌ చేయడంవల్ల అవి విరిగిపోతున్నాయి, దీనివల్ల పోషకాలు తరిగిపోతాయి. అంతేకాకుండా ఈ పాలిష్‌ రైస్‌ వల్ల బి1, బి2, బి6 విటమిన్లను ఖచ్చితంగా కోల్పోతారు.

పాలిష్‌ చేసిన బియ్యం కాకుండా పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్‌ తీసుకుంటే మధుమేహం, బ్లడ్‌ షుగర్‌ వంటి వ్యాధులు రావని మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ వైట్‌ రైస్‌ వాడకం వలన బ్లడ్ షుగర్, మధుమేహం లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయని వారంటున్నారు. ఫైబర్‌ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందుకే వైట్‌ రైస్‌ స్థానంలో హై ఫైబర్‌ రైస్‌ను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories