కార్తీ చిదంబరాన్ని కోర్టు ఎదుట హాజరుపర్చిన సీబీఐ

కార్తీ చిదంబరాన్ని కోర్టు ఎదుట హాజరుపర్చిన సీబీఐ
x
Highlights

మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కార్తీని 14 రోజుల...

మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కార్తీని 14 రోజుల కస్టడీకి అప్పగించాలని
సీబీఐ న్యాయవాదులు కోరారు. ఐఎన్ ఎక్స్ మీడియా సంస్థలోకి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు 2007లో కార్తీ భారీగా ముడుపులు తీసుకున్నారనడానికి పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. కార్తీతో పాటు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ భాస్కర రామన్ ను కలిపి విచారిస్తే...వాస్తవాలు బయటపడతాయని వాదించారు. అయితే కార్తీ తరుఫున వాదించిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి కక్ష సాధింపులో భాగంగానే చిదంబరం కుమారుడ్ని కేసులో ఇరికించారని వాదించారు. మరోవైప కోర్టులో జరిగే వాదనలు వినడానికి చిదంబరం కూడా పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు

Show Full Article
Print Article
Next Story
More Stories