నా కొడుక్కి ఏ శిక్ష వేసినా తప్పులేదు..

Submitted by arun on Fri, 12/22/2017 - 18:01
karthik mother

తన కొడుక్కి ఎలాంటి శిక్షవేసినా తప్పులేదని సంధ్య మృతికి కారకుడైన కార్తీక్‌ తల్లి ఊర్మిల తెలిపింది. శుక్రవారం ఆమె ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ... తన కొడుకు చేసిన తప్పు మరొకరు చేయొద్దని వేడుకున్నారు. సంధ్యతో కార్తీక్‌కు చాలా రోజులుగా పరిచయం ఉందని తెలిపారు. సంధ్య అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని వెల్లడించారు. సంధ్యకు, నా కొడుక్కి.. కొన్నాళ్లుగా పరిచయం ఉంది. సంధ్య తరచూ మా ఇంటికి వచ్చేది.. కొన్నాళ్ల నుంచి నా కొడుక్కి సంధ్య దూరంగా ఉంటోంది. నా కొడుకు సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడు. నా కొడుకు సంధ్యపట్ల మూర్ఖంగా వ్యవహరించాడు. ఓ అమ్మాయి ఉసురు తీశాడు. తల్లి శోకం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని తెలిపింది కార్తీక్‌ తల్లి ఊర్మిళ. తన కొడుకు చేసిన తప్పును మరొకరు చేయొద్దంటూ.. సమస్యలుంటే పెద్దవాళ్లతో మాట్లాడుకోవాలంటూ బోరున విలపించింది. కార్తీక్‌ను తానే తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పానని తెలిపారు.

English Title
karthik mother respond over sandhya rani attack

MORE FROM AUTHOR

RELATED ARTICLES