కన్నడ ఫలితం... ఫ్రంట్‌ రాజకీయానికి ఊతమా?

కన్నడ ఫలితం... ఫ్రంట్‌ రాజకీయానికి ఊతమా?
x
Highlights

ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో లాస్ట్‌బాల్‌ను తలపించే ఉత్కంఠ...క్షణక్షణానికి మారుతున్న సమీకరణలు...ఊహకందని వ్యూహాల మలుపులు...వెరసీ కర్ణాటక రంగస్థలంపై సంకీర్ణ...

ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో లాస్ట్‌బాల్‌ను తలపించే ఉత్కంఠ...క్షణక్షణానికి మారుతున్న సమీకరణలు...ఊహకందని వ్యూహాల మలుపులు...వెరసీ కర్ణాటక రంగస్థలంపై సంకీర్ణ సయ్యాటల పర్వం మొదలైంది. ఏ పార్టీకీ అధికార పీఠం కట్టబెట్టలేదు కన్నడ జనం. కర్ణాటక ఫలితం, రాబోయే జాతీయ రాజకీయాల ముఖచిత్రమా...2019లోనూ కాంగ్రెస్, బీజేపీలకూ మెజార్టీ రాకపోతే, కన్నడ సిత్రమే ఆవిష్కృతమవుతుందా...థర్డ్‌ ఫ్రంట్, ఫెడరల్‌ ఫ్రంట్‌ పాలిటిక్స్‌ మరింత హీటెక్కించబోతున్నాయా?

బలవంతుడ నాకేమని, పలువురతో నిగ్రహించి పలుకుటమేల, బలవంతమైన సర్పము చలిచీమల చేతికిచిక్కి చావదే సుమతి. నూరు గొడ్లను తిన్న రాబంధు ఒక్క తుపానుకు చచ్చింది...ఈ సామెతల్లో ఉన్న భావం ఒక్కటే, బలవంతులు భావించే చాలామంది ఒక్కోసారి, బలహీనులకు దాసోహం కావాల్సి వస్తుంది. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే చిత్రం. జాతీయ పార్టీలమని విర్రవీగే కాంగ్రెస్, బీజేపీల్లో ఏ ఒక్కదానికీ మెజార్టీ లేదు. కానీ దేనికీకొరగాని సీట్లు తెచ్చుకున్న జేడీఎస్‌ మాత్రం కింగ్‌ మేకరై కూర్చుంది. భవిష్యత్తులో ఒక ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందన్న సత్యాన్ని కర్ణాటక ఫలితాలు తేటతెల్లం చేశాయి.

కర్ణాటకలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. జేడీఎస్‌ మూడో ప్రత్యర్థిగా రంగంలోకి దిగింది. నిజంగా గెలవాలని పట్టుదల ఉంటే, జేడీఎస్‌తో, బీజేపీ లేదంటే కాంగ్రెస్‌ జట్టుకట్టాలి. ఆల్రెడీ బెంగళూరు కార్పొరేషన్‌లో జేడీఎస్‌తో కలిసి, పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ అయినా ఎన్నికలకు ముందు పొత్తుకు ప్రయత్నించాల్సి ఉంది. కానీ కాబోయే ప్రధాని తానేనంటూ, ఆర్భాటంగా ప్రకటించుకున్న రాహుల్‌, ఆ చాణక్యం ప్రదర్శించలేకపోయారు. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌, పూల్‌పూర్‌లో, ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టి ఘన విజయం సాధించిన ఉదాహరణలు మరిచిపోయారో, సిద్దరామయ్యకు, రాహుల్‌కు అతివిశ్వాసం తలకెక్కిందో కానీ, జేడీఎస్‌తో ముందస్తు పొత్తులేక, ఓట్లు చీలిపోయి, ఫలితాల తర్వాత, బేరసారాలకు దిగారు. అంటే, కర్ణాటక ప్రయోగం ద్వారా, యూపీ సంకీర్ణ ఫలితం తర్వాత, తెలిసొచ్చింది ఏంటంటే, ముందస్తు పొత్తులకే దండిగా విజయావకాశాలు.

ఇదే రేపటి భవిష్యత్‌ రాజకీయమా? ఇక నుంచి ఫ్రంట్‌ పాలిటిక్స్‌ ప్రయత్నాలు వేగవంతం అవుతాయా? ముందస్తు పొత్తుల రాయబారాలు పెరుగుతాయా? కేసీఆర్ ఫెడరల్‌ ఫ‌్రంట్్, మమత కూటమి, చంద్రబాబు యునైటెడ్‌ ఫ్రంట్‌కు కర్ణాటక ఫలితం మాంచి ఊపునిస్తోందా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీల చుట్టూ, జాతీయ పార్టీలు తిరుగుతాయా? ప్రాంతీయ పార్టీల చుట్టూ జాతీయ పార్టీలే చక్కర్లు కొడతాయా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories