సెల్ఫీకి ప్రయత్నించిన అభిమాని.. లాగి కొట్టిన మంత్రి

Submitted by arun on Mon, 02/05/2018 - 14:36
sivakumar

తమ అభిమాన సినీ నటులు, రాజకీయ నాయకులు కనపడితే చాలు వారితో సెల్ఫీలు దిగాలని తెగ ఆరాటపడిపోతుంటారు అభిమానులు. అయితే, ఒక్కోసారి అభిమానుల ప్రవర్తన చికాకు పుట్టిస్తుంది. ఇటువంటి అనుభవమే కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్‌కి ఎదురైంది. కర్నాటక ఇందనశాఖ మంత్రి శివకుమార్ సెల్ఫీకి ప్రయత్నించిన అభిమానిని లాగిపెట్టి కొట్టారు. ఈ ఘటన బళ్లారిలో జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శివకుమార్‌తో సెల్ఫీ దిగేందుకు కొందరు అభిమానులు ప్రయత్నించారు. ఓ వ్యక్తి ఆయన సమీపంలోకి వచ్చి స్వీయ చిత్రం తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో మంత్రి సహనం కొల్పోయారు. వెంటనే చేయి చేసుకున్నారు. మంత్రి చేయి బలంగా తగలడంతో అభిమాని చేతిలో ఉన్న ఫోన్ చాలా దూరం ఎగిరిపడింది. ఇదేమి పట్టించుకోకుండా మంత్రి తనదారిన తాను వెళ్లిపోయారు. ఈ వీడియో మీడియాకు చిక్కడంతో వైరల్ అయింది. ఇదేమి పెద్ద విషయం కాదని శివకుమార్ తన చర్యలను సమర్ధించుకున్నారు. తన విధి నిర్వాహణకు అభిమాని అడ్డురావడంతో అలా జరిగిందని బదులిచ్చారు.
 

English Title
Karnataka Minister DK Shivakumar loses cool, slaps student over a ‘selfie’

MORE FROM AUTHOR

RELATED ARTICLES