‘నిర్భయ’ తల్లే ఇంత అందంగా ఉందంటే..

‘నిర్భయ’ తల్లే ఇంత అందంగా ఉందంటే..
x
Highlights

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిర్భయ ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. 2012, డిసెంబర్ 16న మానవ మృగాళ్లు.. 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం...

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిర్భయ ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. 2012, డిసెంబర్ 16న మానవ మృగాళ్లు.. 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. నిర్భయ ఘటనను తలచుకుంటే ప్రతి ఒక్కరిలోనూ రోమాలు నిక్కపొడుస్తాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది నిర్భయ. అత్యాచార ఘటనలకు సంబంధించి కఠిన చట్టాలు తయారు చేయాలని పోరాటం చేస్తున్న.. నిర్భయ తల్లి ఆశాదేవిని ఓ మాజీ డీజీపీ హెచ్‌టీ సాంగ్లియానా అవమాన పరిచారు. అది కూడా మహిళాదినోత్సవమైన మార్చి 8న. బెంగళూరులో ఆ రోజు జరిగిన నిర్భయ అవార్డ్స్‌ 2018 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. సాంగ్లియానా ఆ సభలో అప్పటికప్పుడు ప్రసంగించలేదు. ముందే రాసుకొచ్చిన ప్రసంగం చదివారు.

కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానా మాట్లాడుతూ.. ఆశాదేవిపై నోరు జారారు. తాను ఇక్కడ నిర్భయ తల్లిని చూశాను. ఆమె మంచి శరీరాకృతి కలిగి ఉంది. ఈవిడే ఇంత అందంగా ఉంటే ఆమె కూతురు నిర్భయ ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడే ఎవరో వచ్చి వారించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. నిర్భయ పైనా, ఆమె తల్లిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు.. మహిళలు తమపై బలాత్కరం జరుగుతున్నప్పుడు లొంగిపోయి, తర్వాత కేసు పెట్టాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు. అప్పుడే మహిళలు క్షేమంగా ఉంటారని, చావు నుంచి తప్పించుకోగలరని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో మరోసారి స్పందించారు. తాను ఆరోజు చేసిన వ్యాఖ్యలను విచిత్రంగా సమర్థించుకున్నారు.

‘‘నిర్భయ తల్లికి మంచి శరీరాకృతి ఉంది. నేను అదే మాట చెప్పాను. ఆమే అలా ఉంటే నిర్భయ ఎంత అందంగా ఉండేదోనన్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘సాంగ్లియానా.. మీరు ఈ వయసులో కూడా యువకుడిలా, మంచి శరీరాకృతితో ఉన్నారు’ అంటే నేను చాలా సంతోషిస్తాను’’ అన్నారు. అందమైన మహిళలకు సాధారణంగా ముప్పు ఉంటుందని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘‘అందమైన అమ్మాయిలకు రక్షణ, జాగ్రత్త అవసరం. అప్పుడే వారు ఎలాంటి దడులకూ గురి కారు’’ అని ముక్తాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories