కర్నాటకపై టీ.కాంగ్రెస్‌ ఆశలు

Submitted by arun on Sat, 04/07/2018 - 12:21
t c

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయా ? అక్కడ ఏ పార్టీ గెలిస్తే. అదే పార్టీకి తెలంగాణలో బలం పెరుగుతుందా ? కన్నడ నాట ఎన్నికలు అంతలా ప్రభావితం చేస్తాయా ? ఆ రెండు ప్రధాన పార్టీలు కర్ణాటక ఎన్నికలపై ఎందుకు అంచనాలు వేసుకుంటున్నాయి. పక్క రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అదే పార్టీ ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుందా ? 

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కర్ణాటక జపం చేస్తున్నాయ్. మే 12న పోలింగ్‌, 18న కర్ణాటక ఫలితాలు రానున్నాయ్. కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తమ పార్టీ భవిష్యత్‌ మారిపోతుందని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం కన్నడనాట తమ పార్టీ విజయం సాధిస్తే తెలంగాణలో బలపడతామని లెక్కలు వేసుకుంటున్నారు. దక్షిణాదిన తమ పార్టీ హవా ప్రారంభమవుతుందని కాషాయం నేతలు ఊహించుకుంటున్నారు. 

కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీ నాయకత్వం రాష్ట్రంపై దృష్టి పెడుతుందని తెలంగాణ బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ హవా మరింత పెరుగుతుందని కాషాయం నేతలు ఊహించుకుంటున్నారు. అంతేకాకుండా దక్షిణాదిలో కాషాయం మరింత బలపడుతుందని తెలంగాణ కమలం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కీలక నేతలు తెలంగాణలో పర్యటించి పార్టీని బలపరుస్తారని చెబుతున్నారు.

కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలయితే ఆ పార్టీ పతనం ప్రారంభమవుతుందని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల అంచనాలు నిజమవుతాయా ? లేదంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా ? అన్నది తెలియాలంటే మే 18 వరకు ఆగాల్సిందే. 

English Title
Karnataka Election 2018

MORE FROM AUTHOR

RELATED ARTICLES