కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి
x
Highlights

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. మొత్తం 224 సీట్లకు గానూ 218మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిడంతో అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి....

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. మొత్తం 224 సీట్లకు గానూ 218మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిడంతో అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అనూహ్యంగా 90శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయి. ప్రస్తుతమున్న 122మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 107మందికి టికెట్లు ఇచ్చారు. అయితే టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ పలుచోట్ల ఆశావహులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మాండ్యా, చిక్‌ మంగళూరు, రాజాజీనగర్‌‌, బళ్లారి, మంగళూరులో ఆశావహులు రచ్చరచ్చ చేశారు. కాంగ్రెస్‌ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.

కాంగ్రెస్‌ విడుదల చేసిన తొలి జాబితాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మార్కు స్పష్టంగా కనిపించింది. చాముండేశ్వరి స్థానం నుంచి సిద్ధరామయ్య బరిలోకి దిగుతుండగా, ఆయన చిన్న కుమారుడు యతీంద్ర వరుణ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక గత ఎన్నికల్లో ఓడిన కోరట్‌గెరె స్థానం నుంచే కర్నాటక పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌‌లో చేరిన వివాదాస్పద వ్యాపారవేత్త అశోక్‌ బీదర్‌‌‌కు టికెట్‌ దక్కింది. అలాగే మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడికి చితాపూర్‌ సీటు కేటాయించారు. అయితే బెంగళూర్‌ శాంతినగర్‌ సహా ఆరు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉండటంతో ఆశావహులు ఆందోళనలకు దిగుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories