టెన్షన్ పెట్టిన ఆ ఇద్దరు ఎవరు?

టెన్షన్ పెట్టిన ఆ ఇద్దరు ఎవరు?
x
Highlights

కర్ణాటక రాజకీయం చివరి క్షణం దాకా తీవ్ర ఉత్కంఠగా సాగింది. బీజేపీ ఆడిన మైండ్ గేమ్‌.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమిని కలవరపెట్టింది. కాంగ్రెస్, జేడీఎస్...

కర్ణాటక రాజకీయం చివరి క్షణం దాకా తీవ్ర ఉత్కంఠగా సాగింది. బీజేపీ ఆడిన మైండ్ గేమ్‌.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమిని కలవరపెట్టింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యే మద్దతు మాకు ఉందని, బలనిరూపణ చేసుకుంటామని చెప్పి గందరగోళం సృష్టించారు. ఓ వైపు బేరసారాల ఆడియోలు విడుదల కావడం, మరోవైపు సభకు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఆఖరి క్షణాల్లో ఆ ఇద్దరు అసెంబ్లీలో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఊపిరి పీల్చుకుంది. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ బీజేపీ గాలంలో చిక్కుకున్నట్టు ప్రచారం జరిగింది. ఓటింగ్ సమయంలో బీజేపీకి మద్దతు తెలిపేందుకు దూరంగా ఉన్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మధ్యాహ్నం వరకూ ఈ ఇద్దరూ అసెంబ్లీకి రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే, చివరి నిమిషంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీలోకి వచ్చేశారు. వీరు అసెంబ్లీకి ప్రవేశించేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చుట్టుముట్టారు. బల పరీక్షలో కాంగ్రెస్‌కే ఓటు వేసేలా వీరిద్దరినీ సన్నద్ధం చేశారు. కానీ. చివరికి బలపరీక్షే జరగలేదు. ఏది ఏమైనప్పటికీ నిజంగానే ఇది కాంగ్రెస్ - జేడీఎస్‌లకు అద్భుతమే. ఎట్టకేలకు అనుకున్నది సాధించి కర్ణాటక అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా జరుగుతున్న హైడ్రామాకు చెక్ పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories