కరీంనగర్‌లో కమలం వర్సెస్‌ గులాబీ

కరీంనగర్‌లో కమలం వర్సెస్‌ గులాబీ
x
Highlights

అమిత్ షా సభ తరువాత కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. టీఆర్‌ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో మొన్నటి దాక స్తబ్ధుగా ఉన్న...

అమిత్ షా సభ తరువాత కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. టీఆర్‌ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో మొన్నటి దాక స్తబ్ధుగా ఉన్న కరీంనగర్ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ పెంచాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల మలాకర్, బిజేపి అభ్యర్థి నుంచి సంజయ్ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకున్నారు. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన అమిత్ షా సమరభేరి బహిరంగ సభ ఒక్కసారిగా రాజకీయ వాతవరణాన్ని మార్చేసింది. కరీంనగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ ఈసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అమిత్ షా సభ వేదికగానే రాజకీయ ప్రసంగాన్ని ప్రారంభించారు సంజయ్.

తన ప్రధాన ప్రత్యర్థి తాజా మాజీ ఎమ్మెల్య గంగుల కమలాకర్‌పై తీవ్రంగా ఫైర్ అవుతూ ప్రసంగాన్ని కొనసాగించారు సంజయ్‌. గంగులకు ఉన్న గ్రానైట్ వ్యాపారంతో పాటు తనపై వచ్చిన ఇతర విమర్శలను ప్రస్తావించారు. దీంతో అమిత్ షా సభ తరువాత రోజు గంగుల కూడా అదేస్థాయిలో బండి సంజయ్‌పై మండిపడ్డారు. గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తామంటు ఫైర్ అయ్యారు ఇక ఈ విమర్శలకు సంజయ్ కూడా స్పందించారు. తానే చేసిన విమర్శల్లో నిజాలు ఉన్నాయని, వేసిన రోడ్లకే మళ్లీ టెండర్లు వేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ పార్టీదంటూ గంగులపై మండిపడ్డారు.

ఇలా ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడంతో రాజకీయం కాస్త రసవత్తరంగా మారింపోయింది. ఇద్దరు అభ్యర్థులు వ్యూహాలకు పదను పెడుతూ ఎన్నికల మూడ్‌ను కరీంనగర్‌లో తెచ్చారు. మరోవైపు ఈ ఇద్దరి విమర్శలు, ప్రతి విమర్శలకు డైరెక్ట్ అటాక్‌తో పాటు, సోషల్ మీడియా కూడా వేదికగా మారిపోయింది. మరోవైపు వీరిద్దరి రాజకీయాలు ఇలా ఉంటే కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమైన పొన్నం ప్రభాకర్ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తానికి త్రిముఖ పోటీతో కరీంనగర్‌లో మంచి రసవత్తర రాజకీయం ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories