చీకట్లో నింపే వెలుగు

చీకట్లో నింపే వెలుగు
x
Highlights

తెలంగాణ ప్రజల కంటికు పంద్రాగస్టు వచ్చే, 12,751 గ్రామాల్లో కంటి శిబిరాలు తెచ్చే, ఉచితంగా కళ్లద్దాలు, ఉచిత శస్త్ర చికిత్సలు, మొత్తం 812 వైద్య బృందాల...

తెలంగాణ ప్రజల కంటికు పంద్రాగస్టు వచ్చే,

12,751 గ్రామాల్లో కంటి శిబిరాలు తెచ్చే,

ఉచితంగా కళ్లద్దాలు, ఉచిత శస్త్ర చికిత్సలు,

మొత్తం 812 వైద్య బృందాల యొక్క సేవలు. శ్రీ.కో

కంటి చూపు లోపంతో బాదపడుతున్న వారికి కంటి పరీక్షలు చేసి. కండ్లద్దాలు,చికిత్స అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం 'కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగస్టు 15న మెదక్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామంలో ప్రారంభించనున్నారు.అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15 నాడు ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కార్యక్రమ నిర్వహణలో సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలు తదితర అంశాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణలోని 12,751 గ్రామ పంచాయితీలవారిగా చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించ డానికి మొత్తం 812 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపడుతున్న వివిధ వయస్సులకు చెందిన తెలంగాణ ప్రజలకు కంటి వెలుగును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రవేపెడుతు న్నదని ముఖ్యమంత్రి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories