ముఖ్యమంత్రి జగన్ నోట నెంబర్ల మాట!

ముఖ్యమంత్రి జగన్ నోట నెంబర్ల మాట!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య మాటల తూటాలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల అంశం విషయంలో ఇరు పక్షాల మధ్యా అనేక సార్లు చిన్నపాటి యుద్ధాలే సాగాయి. ఒక్కోసారి నువ్వెంత.. అంటే నువ్వెంత అనుకునేవరకూ ఇవి చేరాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి స్పీకర్ కు శుభాకాంక్షలు చెబుతూ ఫిరాయింపుల వ్యవహారాన్ని లేవనెత్తారు. ఫిరాయింపుల విషయంలో దేశస్థాయిలో చర్చ జరగాలనీ.. పార్లమెంట్ లో పటిష్ట చట్టం రూపొందాలనీ చెప్పారు. ఈ సందర్భంగా పార్టీలు మారడం అనే అంశం గురించి వివరిస్తూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకువచ్చారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అపుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిని మారించి ఈ అంశంపై మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇచ్చారనీ, వారిలో నలుగురిని మంత్రులుగానూ చేశారనీ ఇదంతా అక్రమమని తాము స్పీకర్ కు చెబితే స్పీకర్ పదవిని కూడా కించపరిచేలా వ్య్వహరించారానీ చెప్పారు. దేవుడు, ప్రజలు సరైన తీర్పు అందుకే ఇచ్చారన్నారు. దానివల్లే మెమ్మల్ని అక్కడ.. మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టారన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీలు అప్పట్లో వైసీపీ నుంచి టీడీపీ ప్రలోభాలకు లొంగి ఫిరాయిన్చారన్నారు. సర్గ్గా అదే విధంగా ఇపుడు చంద్రబాబుకు కేవలం 23 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ఇచ్చి ప్రతిపక్షంలో కూచోపెట్టారని అది కూడా 23 వ తేదీన కావడం దేవుని గోప్పతనమనీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అంతే కాకుండా.. నేనే గనుక తలుచుకుని ఉంటే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా కూడా ఉండేది కాదన్నారు. చంద్రబాబు చేసిన తప్పులు తాము చేయమనీ, కేవలం తాము సంయమనం పాటించడం తోనే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మీకు అవకాసం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలకు చంద్రబాబు నాయుడు లేచి ఎదో చెప్పబోయి.. అంతలోనే విరమించుకుని నవ్వుతూ చూస్తుండిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories