ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. ఆర్కే-లోకేష్ ఎదురుపడి..

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. ఆర్కే-లోకేష్ ఎదురుపడి..
x
Highlights

2019లో ఏపీ ఎన్నికల్లో సంచలనం రేకెత్తించిన నియోజవర్గాల్లో మంగళగిరి ఒకటి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు అప్పటి మంత్రి నారా లోకేష్ సైకిల్ గుర్తు...

2019లో ఏపీ ఎన్నికల్లో సంచలనం రేకెత్తించిన నియోజవర్గాల్లో మంగళగిరి ఒకటి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు అప్పటి మంత్రి నారా లోకేష్ సైకిల్ గుర్తు మీద పోటీ చేయగా వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్కే పోటీ చేశారు. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే నారా లోకేష్‌ ,ఆళ్ల హోరాహోరిగా ఎన్నికల ప్రచారం చేశారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఇరువురు నేతలు ఊరూరా వాడవాడలా తిరుగుతూ ప్రచారం చేశారు. నారా లోకేష్ తన ప్రచారంలో ఎక్కడ తడబడినా , ఏమాత్రం మాట తూలినా ఆర్కే గ్రూప్ సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని హోరెత్తించింది. ఫలితాలు వెల్లైడన తరువాత నారా లోకేష్ ఓడిపోగా ఆర్కే ఘన విజయం సాధించారు.

ఈ ఇద్దరు అసెంబ్లీ సమావేశాల హాజరయ్యేందుకు వెళుతుండగా ఎదురెదురు పడ్డారు. టీడీఎల్పీకి వెళుతున్న నారా లోకేష్‌ ఎదురుగా వస్తున్న ఆర్కేను చూడగానే కంగ్రాట్స్ అంటూ కరచాలనం చేశారు. ఇందుకు ప్రతిగా థాంక్స్ అంటూ ఆర్కే చెప్పారు. ఎన్నికల తరువాత తొలి సారి వీరిద్దరూ ఎదురెదురు పడ్డారు. ఈ సన్నివేశాన్ని చుట్టుపక్కల వారు ఆసక్తిగా తిలకించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories