రోజులు గడుస్తున్నా.. పాప ఆచూకీ ఏది?

రోజులు గడుస్తున్నా.. పాప ఆచూకీ ఏది?
x
Highlights

పాప ఆచూకీ దొరకలేదు. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన పసిపాప ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియక ఆ కన్నపేగు తల్లడిల్లిపోతోంది. తన బిడ్డ ఆచూకీ కోసం ఆస్పత్రిలోనే...

పాప ఆచూకీ దొరకలేదు. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన పసిపాప ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియక ఆ కన్నపేగు తల్లడిల్లిపోతోంది. తన బిడ్డ ఆచూకీ కోసం ఆస్పత్రిలోనే దీనంగా ఎదురుచూస్తోంది. హస్పిటల్ చుట్టూ సెక్యూర్టీ, హాస్పటల్ లోపల సీసీ కెమెరాలు భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది. ఎవరి కంటా పడకుండా, పాపను ఎలా తీసుకెళ్లారు..? అసలు ఎవరు తీసుకెళ్లారు..? సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం ఉదయం అదృశ్యమైన పాప కోసం అన్వేషణ కొనసాగుతోంది. పాప మిస్సింగ్ వ్యవహారాన్ని సంగారెడ్డి పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. చిన్నారి కోసం ఏకంగా 570 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మెదక్ జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండటంతో అక్కడ కూడా పాప కోసం గాలిస్తున్నారు.

పాప మిస్సింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టిన వైద్య విధాన పరిషత్ అధికారులు ఆయా, స్టాఫ్ నర్స్ ను సస్పెండ్ చేశారు. పాప అదృశ్యం కావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కోన్న స్టాఫ్ నర్స్‌తో పాటు ఆయాపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. సంగారెడ్డి ఆస్పత్రిలో పాప అపహరణపై హెచ్ ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన వైద్య అధికారులు విచారణ చేపట్టింది. పాప ఆచూకీ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో అదృశ్యమైన పాప ఫొటోతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో పాప పోస్టర్ ను అంటించారు. ఆచూకీ తెలిపిన వారికి 50 వేలు క్యాష్ రివార్డు ఇస్తామని సంగారెడ్డి ఎస్పీ తెలిపారు. తన పాపను తెచ్చి ఇచ్చే వరకు ఆస్పత్రి నుంచి వెళ్లేది లేదని తల్లి మాధవి చెబుతోంది. తనకు న్యాయం చేయాలని తన పాపను తెచ్చివ్వాలని కన్నీటితో వేడుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories