జయేంద్ర సరస్వతి అనారోగ్యంతో కన్నుమూత

Submitted by arun on Wed, 02/28/2018 - 10:52
Jayendra Saraswathi

కంచి కామకోటి పీఠాదిపతి జయేంద్ర సరస్వతి అనారోగ్యంతో కన్నుమూశారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్‌. కంచి కామకోటి పీఠానికి ఆయన 69వ అధిపతిగా వ్యవహరించారు. 1935 జులై 18న తంజావూరు జిల్లాలో జన్మించారు. 1954 మార్చి 24న జయేంద్ర సరస్వతిగా పేరు మార్చుకున్నారు. శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్న జయేంద్ర సరస్వతి అనారోగ్యంతో కాంచీపురంలోని ఏబీసీడీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.

English Title
Kanchi Shankaracharya Jayendra Saraswathi Dies At 82

MORE FROM AUTHOR

RELATED ARTICLES