హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ.. ఆ నలుగురినీ ఉద్యోగం నుంచి తొలగించిన కామినేని ఆసుపత్రి

Submitted by arun on Sat, 09/01/2018 - 10:14
kamineni hospital

నల్గొండ జిల్లాలోని కామినేని ఆస్పత్రిలో జరిగిన వ్యవహారంపై యాజమాన్యం స్పందించింది. తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణతో సెల్ఫీలు దిగిన ఆస్పత్రి సిబ్బందిని సస్పెండ్ చేసింది. రెండురోజుల క్రితం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను కామినేని ఆస్పత్రికి తరలించినప్పుడు నలుగురు సిబ్బంది సెల్ఫీలు దిగారు. విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో యాజమాన్యం స్పందించి వారిపై వేటు వేసింది. మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆసుపత్రిలోని కొందరి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఆసుపత్రి తరపున హరికృష్ణ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

English Title
kamineni hospital response selfie harikrishna dead body

MORE FROM AUTHOR

RELATED ARTICLES