హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ...స్పందించిన యాజమాన్యం

Submitted by arun on Fri, 08/31/2018 - 16:56
Selfie

నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే అక్కడ పనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో  సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్‌ చేసి రాక్షసానందం పొందారు. హరికృష్ణ మృతదేహంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, మరో వార్డ్ గర్ల్ కలిసి స్మైలీతో సెల్ఫీ దిగటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది చర్య పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కామినేని ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసింది. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.

English Title
kamineni hospital respond on Selfie

MORE FROM AUTHOR

RELATED ARTICLES