పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వైసీపీ ప్రభంజనం

కె.హెచ్. బాబు
Published on: 19 May 2019 7:06 PM IST
పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వైసీపీ ప్రభంజనం
X

ఏపీ సార్వత్రిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలు ఛానల్స్ సర్వేలు వెల్లడించాయి. సర్వే లెక్కల ప్రకారం చూసుకున్నట్లేయితే పీపుల్‌ పల్స్‌ సర్వేలో వైసీపీకి పట్టం కట్టింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 112 సీట్లలో వైసీపీ విజయకేతనం ఎగురవేయవచ్చని పీపుల్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. అలాగే టీడీపీ 59 స్థానాల్లో విజయం సాధించే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక జనసేన పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించవచ్చునని పేర్కొంది. వైసీపీకి 45.4 శాతం ఓట్లు, టీడీపీకి 42.3 శాతం, జనసేనకు 8.4 శాతం, ఇతరులకు 3.9 శాతం ఓట్లు రావచ్చునని వెల్లడించింది.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story