జయరాంను చంపినట్లు ఒప్పుకున్న రాకేష్ రెడ్డి

జయరాంను చంపినట్లు ఒప్పుకున్న రాకేష్ రెడ్డి
x
Highlights

పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు మిస్టరీ వీడింది. హంతకుడిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు హత్యతో సంబంధం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి...

పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు మిస్టరీ వీడింది. హంతకుడిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు హత్యతో సంబంధం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిశ్రామికవేత్త జయరామ్‌ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు జయరామ్‌ను తానే చంపినట్లు రాకేష్ రెడ్డి ఒప్పుకున్నాడు. 4.5కోట్ల డబ్బు వ్యవహారంలో హత్య చేశానని ఒప్పుకున్నాడు. జయరాంను హైదరాబాద్‌లోనే చంపేసి మృతదేహాన్ని కంచికచర్ల వద్ద పడేసినట్లు పోలీసులు తేల్చారు.

జయరాం తలకు బలమైన గాయమైనట్లు చిత్రీకరించేందుకు బీర్‌ బాటిల్‌తో తలపగులగొట్టి, కారులోని వెనుక సీట్లో మృతదేహాన్ని ఉంచి కారును పక్కకు నెట్టేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాకేష్‌రెడ్డి వద్ద తీసుకున్న 4.5కోట్ల అప్పే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, రెండు రోజులుగా దర్యాప్తు చేపట్టారు. చివరికి సెల్‌సిగ్నల్స్ ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు. మరోవైపు ఈరోజు హైదరాబాద్‌లో జయరాం అంత్యక్రియలు జరుగనున్నాయి. అమెరికా నుంచి జయరాం కుటుంబసభ్యులు నగరానికి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories