రానా ఇబ్బందిని... వేస్ట్ ఆఫ్ టైమ్ అన్న కాజల్

Submitted by arun on Tue, 01/23/2018 - 14:47
ranakajal

రానా తన విమాన కష్టాన్ని చెప్తే... కాజల్ వేస్ట్ ఆఫ్ టైమ్ అంటూ కొట్టిపారేసింది. ఇదంతా ఎక్కడ జరిగిందీ అనుకుంటున్నారా? ట్విట్టర్ వేదికగా జరిగింది. నిన్న రానా ముంబైకి వెళ్లారు. ఈ ప్ర‌యాణంలో భాగంగా ఆయ‌న‌కు విమాన క‌ష్టాలు ఎదుర‌య్యాయి. ఎయిర్‌ ట్రాఫిక్, పార్కింగ్ స‌మ‌స్య‌ల‌ దృష్ట్యా ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వెళ్లాల్సిన విమానాన్ని, డొమెస్టిక్ విమానాశ్ర‌యానికి మళ్లించారు. దీంతో మ‌ళ్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వెళ్ల‌డానికి రానా ముంబై ట్రాఫిక్‌లో అర‌గంటపాటు ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. ఈ ఇబ్బందిని ఆయ‌న ఓ ట్వీట్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ట్వీట్‌కి ఆయ‌న బెస్ట్‌ఫ్రెండ్, న‌టి కాజ‌ల్ కామెంట్ చేసింది. 'అవన్నీ ఎయిర్‌ ట్రాఫిక్‌ సమస్యలు. ఇలాంటి సమస్యలు ఈ మధ్య దారుణంగా మారుతున్నాయి. వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌' అంటూ రిప్లై పెట్టింది.

English Title
kajal aggarwal replay to rana daggubati

MORE FROM AUTHOR

RELATED ARTICLES