మాగుంట దారెటు ?

మాగుంట దారెటు ?
x
Highlights

మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? ఏ జిల్లా నుంచి పోటీ చేస్తారనేది హాట్ టాపిక్‌లా మారింది. మాగుంట పనులు, వేసే అడుగులు రాజకీయ...

మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? ఏ జిల్లా నుంచి పోటీ చేస్తారనేది హాట్ టాపిక్‌లా మారింది. మాగుంట పనులు, వేసే అడుగులు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీని వీడి వైసీపీలో చేరుతారా...? మరో కొత్త పార్టీకి జంపవుతారా? లేక టీడీపీ నుంచే మరోసారి పోటీ చేస్తారా..?

ఒంగోలు పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది చర్చనీయాంశమైంది. జిల్లాలో సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేయనున్నారనేది సస్పెన్షన్‌గా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన మాగుంట వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని భావించారు మాగుంట. ఆయన దీనిపై సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. సర్వే ఫలితాలు మాగుంటకు వ్యతిరేకంగా వచ్చాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తన ఓటమికి కారణమవుతుందని అనుకున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చాలని సూచనలు చేశారు. దీనికి రెస్పాన్స్ రాకపోవడం, స్థానిక అభ్యర్థులు మాగుంటపై ఫైర్ అవడంతో పార్టీ మారడానికి సిద్ధపడ్డాడు మాగుంట.

అసంతృప్తితో ఉన్న మాగుంటకు వైసీపీ గాలం వేసింది. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించింది. ఈ విషయం అధినేత చంద్రబాబు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ‌్‌ను మాగుంట తన అనుచరులతో కలిశారు. దీంతో మాగుంట జనసేనలో చేరుతారనే పుకార్లు వచ్చాయి. పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారని అనుచరులతో చెప్పించుకున్నారు మాగుంట.

పార్టీ మారడం ఎంపీగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు మాగుంట. ఇటు టీడీపీ అటు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నా ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories