చంద్రబాబు గాలి తీసేసిన కడియం!

Submitted by arun on Mon, 03/05/2018 - 17:37
Kadiyam Srihari

కడియం శ్రీహరి.. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రే కావొచ్చు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుడే అయి ఉండొచ్చు. కానీ.. ఒకప్పుడు టీడీపీలో కూడా కడియం శ్రీహరి అగ్ర నాయకుడిగా ఎదిగారు. మంత్రి అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీగా గెలిచి.. రాజీనామా చేసి చివరికి ఎమ్మెల్సీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. అలాంటి చంద్రబాబు మాజీ అనుచరుడు కడియం ఇప్పుడు కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ పెట్టాలంటే నాడు టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఒక్కరే సమర్థులుగా కనిపిస్తే.. ఇన్నాళ్లకు కేసీఆర్ ఆ ప్రయత్నం చేస్తున్నారంటూ కడియం చెప్పుకొచ్చారు. కానీ.. తాను చేస్తేనే ఆ మధ్య వాజ్ పేయి లాంటి వాళ్లు ప్రధాని అయ్యారని చంద్రబాబు అప్పుడప్పుడూ చెబుతుంటారు. స్వర్ణ చతుర్భుజి పథకాన్ని కూడా చంద్రబాబు తన ఆలోచనగానే చెప్పుకుంటుంటారు. ఇంకా.. వాజ్ పేయి హయాంలో జరిగిన కార్యక్రమాలన్నిటికీ తానే రూపకల్పన చేశానన్నట్టుగా కూడా బాబు చెబుతుంటారు.

అలాంటి బాబును.. మాజీ అనుచరుడైన కడియం.. జాతీయ రాజకీయాల ప్రస్తావన సందర్భంగా మరిచిపోవడం.. తెలుగు తమ్ముళ్లకు కాస్త ఇబ్బంది అనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే… బిల్ క్లింటన్, బిల్ గేట్స్, పీవీసింధు, సత్య నాదెళ్ల లాంటి వాళ్లను తానే ప్రభావితం చేశానని చెప్పుకునే చంద్రబాబు గురించి మాట కూడా ప్రస్తావించకపోవడంతో.. చంద్రబాబు గాలిని కడియం తీసిపారేశారని అంతా అనుకుంటున్నారు. మరి కడియం కావాలని అన్నారో.. నిజంగానే చంద్రబాబును ఉద్దేశించి అన్నారో కానీ.. ఈ మాటలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

English Title
kadiyam srihari comments cm kcrs idea third front

MORE FROM AUTHOR

RELATED ARTICLES