బీపీ పేషెంట్లకు దానిమ్మ వల్ల ఎంతో మేలు..

బీపీ పేషెంట్లకు దానిమ్మ వల్ల ఎంతో మేలు..
x
Highlights

దానిమ్మ పండులో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. ఈ పండు తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. రోజూ ఒక దానిమ్మ పండును తినడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షణ...

దానిమ్మ పండులో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. ఈ పండు తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. రోజూ ఒక దానిమ్మ పండును తినడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. దానిమ్మలో విటమిన్‌ సి, ఇ ,కే, బి1, బీ2, ఫైబర్‌ మెండుగా లభిస్తాయి. అందుకే ఏ కాలంలోనైనా దానిమ్మ పండు తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైల్స్ చికిత్సకు దానిమ్మపండు చాలా ప్రభావవంతమైనది.

రక్తస్రావాన్ని నివారించడానికి ఎండిన దానిమ్మ పొడిని ఒక టీస్పూన్ తీసుకోవాలి. దానిమ్మ గింజలు, దానిమ్మ గింజల రసం గుండెకు మంచి టానిక్ లాంటిది. గుండె వ్యాధుల నివారణకు దానిమ్మ చాలా మంచిది అని చాలా సార్లు రుజువయ్యింది.

దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలపై కొవ్వు పెరుకుపోవడాన్ని అడ్డుకుంటాయి. ఇది గుండెకు మాత్రమే కాకుండా కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. బీపీ ఉన్న పేషెంట్లకు దానిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories