ఫేస్‌బుక్‌లో ‘కాలా’ ప్రీమియర్ షో లీక్!

Submitted by arun on Thu, 06/07/2018 - 12:13
kaala

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రానికి కూడా కష్టాలు తప్పలేదు , ఆన్ లైన్ లో ఆ సినిమా లైవ్ స్ట్రీమింగ్ పెట్టి సంచలనం సృష్టించాడు ఓ అభిమాని . కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదల అవుతున్నప్పటికీ , ఓవర్ సీస్ లో మాత్రం ముందుగానే ప్రీమియర్ షోలు పడ్డాయి అందునా సింగపూర్ లో రజనీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ ముందుగానే షో వేశారు . అయితే ఆ సినిమాకు వెళ్లిన ప్రవీణ్ దేవర అనే వ్యక్తి కాలా చిత్రాన్ని దాదాపు 45 నిమిషాల పాటు ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చేసాడు . సింగపూర్ లో జరిగిన ఈ ఘటనను నిర్మాత ధనుంజయన్ ట్విట్టర్ ద్వార టీఎఫ్పీసీ అధ్యక్షుడు విశాల్ కు షేర్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన విశాల్ దీనికి కారణమైన వ్యక్తిని సింగపూర్ అధికారులతో మాట్లాడి అరెస్టు చేయించారు. ఫేస్ బుక్ పేజీ నుంచి కాలా లైవ్ ను తొలగింపజేశారు.  పైరసీ నిరోధానికి విశాల్ తీసుకున్న చర్యను సౌందర్య రజినీకాంత్ అభినందించారు. పైరసీని నివారించి కాలా సినిమాను రక్షించండి అంటూ సౌందర్య ట్వీట్ చేశారు. 

English Title
Kaala movie leaked on Facebook

MORE FROM AUTHOR

RELATED ARTICLES