ఎన్టీఆర్ కు ప‌రీక్ష‌పెట్టిన డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్

ఎన్టీఆర్ కు ప‌రీక్ష‌పెట్టిన డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ ఏడాది ఓ కొత్త సవాల్ విసిరింది. అదే స్లిమ్ గా మారడం..ప్రస్తుతం కాస్త బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ మూవీలో లావు తగ్గి...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ ఏడాది ఓ కొత్త సవాల్ విసిరింది. అదే స్లిమ్ గా మారడం..ప్రస్తుతం కాస్త బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ మూవీలో లావు తగ్గి మ్యాచో లుక్ లో దర్శనం ఇవ్వనున్నాడు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టాడు. కండలు పెంచేందుకు వర్కౌట్లు స్టార్ట్ చేశాడు. దానికి ఓ ట్రైయినర్ సాహయం తీసుకుంటున్నాడు. అది కూడా మామూలు ట్రైయినర్ కాదు బాలీవుడ్ స్టార్ హీరోలను కండల వీరుడిగా చూపించిన ట్రైయినర్ తో..

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జైత్ర కొనసాగిస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. ఫస్ట్ టైం సినిమా చేస్తోన్న ఈ క్రేజీ కాంబోపై ఇప్పటి నుంచే బోలెడన్నీఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు దర్శకుడు త్రివిక్రమ్ పెద్ద పరీక్షే పెట్టాడు. ఎన్టీఆర్ ను స్లిమ్ గా సిక్స్ ప్యాక్ తో చూపించేందుకు లావు తగ్గి, కండల పెంచాలని ఆదేశించాడు.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీని ఇద్దరూ ప్రెస్టిజీయస్ గా తీసుకున్నారు. ఎన్టీఆర్ ను గత సినిమాలకు డిఫరెంట్ గా చూపించాలని త్రివిక్రమ్..మూవీని హిట్ గా మలుచుకోవడం కోసం తనవైపు నుంచి ఎలాంటి మైనస్ పాయింట్స్ ఉండకుండా చూసుకుంటున్నాడు తారక్. అందుకే లావు తగ్గాలని త్రివిక్రమ్ అదేశించగానే ఓకే అనేశాడు. దానికి వర్కౌట్లు కూడా మొదలెట్టాడు. కండలు తిరిగిన బాడీతో మ్యాచో లుక్ లో కనిపించేందుకు జిమ్ లో కూస్తీలు పడుతున్నాడు. అందుకోసం ప్రొఫెనలిస్ట్ ఐన లాయిడ్ స్టివెన్ అనే ఫారెన్ జిమ్ ట్రైయినర్ పిలిపించుకున్నాడు.

ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించబోతోన్న జిమ్ ట్రైయినర్ చాలా ఫేమస్. బాలీవుడ్ కండల వీరులు హ్రుతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్ బాడీ ఫిట్ నెస్ వెనకా ఈ ట్రైయినర్ దే కీలక పాత్ర. వాళ్లిద్దరి తర్వాత ఇప్పుడు తారక్ కు ట్రైయినర్ గా మారాడు. దీన్ని బట్టి చూస్తే తారక్ కూడా ఎలా చూపించబోతున్నాడో ఊహించొచ్చు. ప్రొపెషనలిస్ట్ ఐన ఈ జిమ్ ట్రైయినర్ చాలా ఖరీదు. గతంలో హ్రితిక్ ఈ ఫారెన్ ట్రైయినర్ కు నెలకు 30లక్షలు ఇచ్చాడట. త్రివిక్రమ్ మూవీని చాలా సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ కాస్త ఖర్చు ఎక్కువైనా సిక్స్ ప్యాక్ కోసం ఖరీదైన ట్రైయినర్ ను రప్పించుకున్నాడు. ఫిబ్రవరిలో మూవీ స్టార్ట్ కానుండడంతో ఆలోపు లావు తగ్గి స్లిమ్ గా మారాలని చూస్తున్నాడు. టెంపర్ సినిమా కోసం అల్రేడీ ఓసారి సిక్స్ ప్యాక్ ట్రై చేసిన ఎన్టీఆర్ మళ్లీ త్రివిక్రమ్ కోసం మ్యాచో భాయ్ గా మారబోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories