బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్..
x
Highlights

నాని హోస్ట్ గా వ్యహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగా సాగుతోంది. 16 మంది సభ్యులు కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో సంజన, నూతన్...

నాని హోస్ట్ గా వ్యహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగా సాగుతోంది. 16 మంది సభ్యులు కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2 ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ సాగుతోంది. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది. కానీ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో నాని.. ఎన్టీఆర్ కన్నా కాస్త వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఆ షో టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. కానీ తొలి సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు కొంచెం వెనుకపడిందని టాక్. అయితే దీని టీఆర్పీని పెంచేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయని సమాచారం. దీనిలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సడెన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఏదైనా జరగొచ్చు.. ఏ క్షణమైనా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్ గెస్ట్‌గా ఎంటర్ అవ్వొచ్చని సమాచారం. ఇదే కనుక జరిగితే బిగ్‌బాస్ సీజన్ 2 రేటింగ్ కూడా అమాంతం పెరగడం ఖాయం. అయితే అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories