కనిపించిన నెలవంక .. ప్రపంచ వ్యాప్తంగా మొదలయిన రంజాన్ వేడుకలు ..

కనిపించిన నెలవంక .. ప్రపంచ వ్యాప్తంగా మొదలయిన రంజాన్ వేడుకలు ..
x
Highlights

ప్రతి పండగ వెనుక ఓ అర్ధం మరియు పరమార్ధం దాగి ఉంటుంది .. అది ఏ మత పండగకైనా సరే.. ఇక ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ.. దీనిని...

ప్రతి పండగ వెనుక ఓ అర్ధం మరియు పరమార్ధం దాగి ఉంటుంది .. అది ఏ మత పండగకైనా సరే.. ఇక ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ.. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు... రంజాన్ రోజు ముస్లిం సోదరులు బిర్యానీ తిని, సేమ్యా ఖీర్ తాగుతూ ఈ పండగను జరుపుకుంటారు.

ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్ర్రాల్లో పలువురు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండంతో మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

గత ఐదేళ్లుగా బోనాలు, బతుకమ్మ, గణేష్ జయంతి, రంజాన్, క్రిస్ మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం...ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తుంది..

రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం తనకున్న కొద్దిపాటి సంపాదనలో కొద్ద గొప్పో దానం చేయాలని ఖురాన్ చెబుతుంది. దీంతో ఉన్నత కుటుంభాల్లో ఉన్న ముస్లింలు వారి స్థాయిలను బట్టి ఈరోజు బీద ముస్లింలతోపాటు ఇతర బీద ప్రజలకు పలు దానాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories