కొడుకు శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి..!

Submitted by lakshman on Fri, 01/19/2018 - 07:30
Jithu Job

ఓ క‌న్న‌త‌ల్లి త‌న కొడుకును అత్యంత దారుణంగా హ‌త్య చేసి చంపేసింది. ఏమీ తెలీయ‌న‌ట్లుగానే కొడుకు క‌నిపించ‌డంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో క‌న్న‌త‌ల్లే  కొడుకును హ‌త్య చేసింద‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. 
కేర‌ళ‌ కొళ్లాం జిల్లా  జితూ జాబ్(14) తన తల్లి జయమోల్‌తో కలిసి కొళ్లాం జిల్లా నెడుంబనలో నివాసం ఉంటున్నాడు. అయితే రెండు రోజుల క్రితం తొమ్మిదో తరగతి చదువుతున్న జితూకు, త‌ల్లి జ‌య‌మోల్ ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ ఘ‌ర్ష‌ణలో జ‌య‌మోల్ త‌న కొడుకు జితూను గొంతు నులిమి హ‌త్య  చేసింది. అనంత‌రం  పెట్రోల్ పోసి శ‌వాన్నిత‌గ‌ల‌బెట్టింది. 
ఇదిలా ఉంటే త‌న కొడుకు జితూ  స్కేలు కొనుక్కునేందుకు షాపుకు వెళ్లితిరిగిరాలేద‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్టారు. ఈ కేసుపై విచార‌ణ చేసి సాక్ష్యాల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా..ఈ గాలింపు చ‌ర్య‌ల్లో ఇంటి స‌మీపంలో మృత‌దేహం కాలిపోయి ఉండ‌డాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో చుట్టుప‌క్క‌ల వారిని, ఇంట్లో కుటుంబ‌స‌భ్యుల్ని వివరాలు అడిగారు. అయితే  ఈ విచార‌ణ జ‌రిగే స‌మ‌యంలో బాధితుడు త‌ల్లి చేతికి గాయాలు ఉండ‌డం గ‌మ‌నించి  తమ‌దైన శైలిలో పోలీసులు విచారించారు. ఈ విచార‌ణ‌లో త‌ల్లి దాష్టికం వెలుగులోకి వ‌చ్చింది. 
 కుమారుడిని తానే హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. సోమవారం తల్లితో గొడవపడ్డ తర్వాత జితూ గొంతునులిమి ఉపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. జితూ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది జయమోల్. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి ముఖానికి నిప్పుపెట్టి కాల్చివేసినట్లు వెల్లడించింది.

English Title
jithu-job-murder-kerala-jaya-mol-arrest-kollam

MORE FROM AUTHOR

RELATED ARTICLES