జియోఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

Submitted by arun on Wed, 01/17/2018 - 14:38
Jio Phone

రిలయన్స్‌ జియో ఫోన్‌ యూజర్లకు ఆ కంపెనీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జియోఫోన్‌కు చెందిన 153 రూపాయల ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.  ఇప్పటి వరకు ఈ ప్యాక్‌లో కస్టమర్లకు రోజుకు 500 ఎంబీ డేటా మాత్రమే లభించగా, ఇప్పుడు దాన్ని జియో 1జీబీకి పెంచింది. దీంతో రూ.153 ప్లాన్‌ను వాడే జియో కస్టమర్లు 28 రోజులకు గాను రోజుకు 1జీబీ డేటా చొప్పున 28 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ జియో యాప్స్ యథావిధిగా లభిస్తున్నాయి. అలాగే రూ.149 ప్లాన్‌కు కూడా రూ.153 ప్లాన్ బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు జియో ఫోన్‌ యూజర్లకు అదనంగా మరో రెండు శాచెట్‌ ప్యాక్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒకటి రూ.24 ప్యాక్‌. దీని కింద రోజుకు 500 ఎంబీ హై స్పీడ్‌ డేటా, 20 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్‌ యాక్సస్‌ను రెండు రోజుల పాటు లభ్యమవనున్నాయి. రెండోది రూ.54 ప్యాక్‌. దీని కింద ఏడు రోజుల పాటు పైన పేర్కొన్న ప్రయోజనాలనే ఆఫర్‌ చేస్తుంది. కానీ ఎస్‌ఎంఎస్‌లు 70 వస్తాయి. 

English Title
jio increased data limit for rs153 plan

MORE FROM AUTHOR

RELATED ARTICLES