మనసుని కదిలిస్తున్న శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్‌ లేఖ

Submitted by arun on Tue, 03/06/2018 - 17:48
jhanvi

జాన్వీ కపూర్, అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కూతురు హీరోయిన్ గా మారి, ఓ సినిమా చేస్తున్న తను, ఫస్ట్ టైం తల్లి లేకుండా బర్త్ డే జరుపుకుంటోంది. అమ్మే సర్వస్వంగా పెరిగిన జాన్వీ, తన పుట్టిన రోజున, తల్లి జ్ఞాపకాలతో గడుపుతోంది. ఇద్దిర మధ్య అనుబంధాన్ని తన ఒక్క ట్వీట్ లెటర్ లోనే తెలిసేలా చేసి కదిలించింది. 
 
అమ్మ, నువ్వు లేకుండా చెదిరిన మనస్సుతో, ఎలా బతకాలో ఇప్పుడు  నేను నేర్చుకోక తప్పదని తెలుసమ్మా.......అయినా శూన్యంగా మారిన నామనసులో కూడా నేను నిన్ను చూడగలుగుతున్నాను. దు:ఖం, బాధ నుంచి నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నావని తెలుసు...ఎప్పుడు కళ్లు మూసినా, నాకు కేవలం నీ గ్నాపకాలే గుర్తొస్తున్నాయి. దానిక్కారణం నువ్వేనని తెలుసు. నువ్వు మా అందరిని ఆశిర్వదిస్తున్నావని తెలుసు..... నువ్వు ఈలోకానికి చెందినదానివి కాదు....చాలా మంచిదానివి....స్వచ్చమైన మనసున్న దానివి....ప్రేమను పంచే దానివి....అందుకే దేవుడు వెంటనే నిన్ను వెనక్కి తీసుకుపోయాడు. కనీసం ఇంత కాలమైనా మేము నిన్ను కలిగి ఉండటమే భాగ్యమే.

నా స్నేహితులెప్పుడూ అంటూండే వాళ్లు...నేనెంతో అదృష్టవంతురాలిని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందిన దాన్ని స్నేహితులన్నప్పుడు అర్ధం కాలేదు....కాని ఇప్పుడు తెలుస్తోందమ్మా...అదంతా నీవల్లే....ఎంత పెద్ద సమస్య కూడా నాకెప్పుడు ఇబ్బందిగా మారలేదు....ఏరోజు కూడా నేను నిరుత్సాహపడలేదు....ఎందుకంటే నాకు నువ్వున్నావు....అంతగా నువ్వు నాకు ప్రేమనందించావు. ప్రేమగా చూసుకున్నావు. నేను ఎవరి మీద ఆధారపడి ఉండాల్సిన పనిలేదు....దేని మీద ఆధారపడాల్సిన పనిలేదు...ఎందుకంటే నా అవసరం నువ్వే...నా ఆత్మలో భాగం నువ్వే....నువ్వు నా ప్రియమైన నేస్తం, నేనిలా ఉండడానికి కారణం నువ్వే.

నీ జీవితం అంతా ఇస్తూనే వచ్చావు..నేను కోరుకునేదల్లా ఒక్కటే, నాకు కూడా అలానే చేయాలనుంది నువ్వు గర్వపడేలా చేయాలనుంది. నేను నీకు మాటిస్తున్నాను. నిన్ను చూసి మేము గర్వ పడ్డట్టే, నన్ను చూసి నువ్వు గర్వపడేలా చేస్తాననే నమ్మకంతోనే రోజు నిద్ర లేస్తున్నాను. నువ్వు నాతోనే ఉన్నావనే అనుభూతి నాకు కలుగుతోంది ఎందుకంటే నువ్వు నాలో, చెల్లిలో, నాన్నలో అందరిలో ఉన్నావు. నీ జ్ఞాపకాలతో మా మీదు నీ ముద్ర అంత బలంగా వేశావు. మేము ముందుడుగు వేయటానికి అది చాలనుకుంటా కాకపోతే, నువ్వులేని లోటుతో, మాకు ఏది పూర్తిగా దక్కినా, అది అసంపూర్ణమే

English Title
Jhanvi Kapoor Turns 21, First Birthday Without Mother Sridevi

MORE FROM AUTHOR

RELATED ARTICLES