అసెంబ్లీలో ప్రతి ప్రసంగం వెనక ఆయనే : ఏపీ సీఎం వైఎస్ జగన్

అసెంబ్లీలో ప్రతి ప్రసంగం వెనక ఆయనే :  ఏపీ సీఎం వైఎస్ జగన్
x
Highlights

తాను కాంగ్రెస్‌ను వీడి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, దేని గురించి ఆలోచించకుండా తనతో కలిసి అడుగులు వేసింది దివంగత డీ.ఏ.సోమయాజులు అని ఏపీ ముఖ్యమంత్రి ...

తాను కాంగ్రెస్‌ను వీడి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, దేని గురించి ఆలోచించకుండా తనతో కలిసి అడుగులు వేసింది దివంగత డీ.ఏ.సోమయాజులు అని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 2014లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టింది మొదలు, సభలో తను చేసిన ప్రతి ప్రసంగం వెనుక ఉన్నది సోమయాజులు అని చెప్పారు. ఆయన నిరంతరం ఒక గురువులా వ్యవహరించారని సీఎం వైయస్‌ జగన్‌ స్మరించుకున్నారు.

వైయస్సార్‌సీపీ రాజకీయ, ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరించిన కీర్తి శేషులు డీ.ఏ.సోమయాజులు 67వ జయంతి సందర్భంగా విజయవాడ, ది వెన్యూ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సోమయాజులు అన్ని విషయాలపై పూర్తి అవగాహనతో ఉండడమే కాకుండా, ఆయా సబ్జెక్ట్‌ మీద అందరికీ ట్యూషన్‌ చెప్పే వారని సీఎం గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ను వీడి పార్టీ ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో.. ఏం జరుగుతుందో? పార్టీ నిలబడుతుందా? ముందుకెళ్తుందా? అన్న మీమాంస చాలా మందిలో ఉండేదని, కానీ తాను మాత్రం దేవుణ్ని నమ్మానని, ప్రజలు కూడా తోడుగా ఉన్నారని గట్టిగా నమ్మే వాడినని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తన వెనక ఎవరున్నారు? ఎంత మంది నాయకులు ఉన్నారు? అన్న విషయాన్ని పక్కనపెట్టి.. మొట్టమొదట తనతో పాటు అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు అన్న అని, ఆ తర్వాత కూడా ప్రతి సందర్భంలోనూ తనకు ఒక గురువులా ఉన్నారని తెలిపారు. ప్రతి విషయంలోనూ తనకు సూచనలు, సలహాలు ఇస్తూ నడిపించారని గుర్తు చేశారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, 2014లో తాను ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు, తన ప్రతి ప్రసంగం వెనక ఉండి, నడిపించింది ఎవరూ అంటే.. సోమయాజులు అన్న అని గర్వంగా చెబుతానని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

'ఇవాళ సోమయాజులు అన్న మన మ«ధ్య లేకపోవచ్చు. కానీ ఆయన ఎక్కడికీ పోలేదని, మన కళ్ల ఎదుటనే ఉన్నాడు అని చెప్పడానికి నాకు కృష్ణను చూసినప్పుడు అనిపిస్తుంది. కృష్ణ కూడా ఏదో ఒక రోజు తండ్రిని మించిన తనయుడు అవుతాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. సోమయాజులు అన్న మాదిరిగా తనకు కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉండడంతో పాటు, ఈరోజు సోమయాజులు అన్న లేకపోయినా, తన పాత్రను.. కృష్ణ దగ్గరుండి నా దగ్గర నిర్వహిస్తున్నాడు' అని సీఎం అభినందించారు.

సోమయాజులు కుటుంబానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానని, వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories