మరోసారి రెచ్చిపోయిన ఎంపీ జేసీ.. ఏకంగా వారినే టార్గెట్..

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 17:30
jc-diwakar-reddy-sensational-comments-mla

అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా పోలీసులనే టార్గెట్ చేశారు.  బుస కొట్టే పాము కాటేయదని అనంతపురం పోలీసులను ఉద్దేశించి అయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.  దొంగతనం చేసినవారిని కుర్చీలో కూర్చోబెడుతున్నారని, పోలీసులకు అసలు వెన్నెముకే లేదని జేసీ దివాకరరెడ్డి  విమర్శించారు. పాము బుస కొడుతుంది.. కానీ కాటేయదని, ఆ బుస కొట్టేది కూడా లేకపోతే పోలీసులు ఇంకేం పని చేస్తారు? ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన అన్నారు. కాగా అనంతపురంలో జరుగుతున్న అవినీతి  గురించి మీడియాలో వస్తున్న కథనాలపై విచారణ చేయాలని ఐఏఎస్ ఆఫీసర్ ను కోరినా ఫలితం లేదని ఆయన వాపోయారు. అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారన్న  జేసీ..ఓ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

English Title
jc-diwakar-reddy-sensational-comments-mla

MORE FROM AUTHOR

RELATED ARTICLES