జేసీ రఫ్ఫాడేశారు.. మోడీని, బాబునీ.. చివరకు జగన్ నూ

Submitted by arun on Thu, 07/12/2018 - 14:43

ఆయన సామాన్యుడు కాదండి ఎవర్నయినా తిట్టడంలో అస్సలు మొహమాటపడరు రాజీపడరు నోటి కెంతోస్తే అంత కాస్త వెటకారం, కాస్త సీమ మోటుదనం కలగలిపి రఫ్ఫాడేస్తుంటారు. అనంతపురం రాజకీయాల్లో జేసి దివాకర్ రెడ్డి స్టైలే వేరు ఆయన ఎవరికి భయపడరు పైపెచ్చు ఎవరి పార్టీలో ఉంటే వారినే తిట్టడం ఆయన స్పెషాలిటీ. వైఎస్ కేబినెట్ లో ఉన్నప్పుడు ఆయన్ను అప్పుడప్పుడు ఆడిపోసుకునేవారు అవి పైకి సరదా మాటల్లాగే కనిపించినా ఒక్కోసారి శృతిమించినట్లు కనిపిస్తాయి. అయినా జేసితో పెట్టుకోడానికి ఎవరూ సాహసించరు ఆయన మాటలను ఎవరూ పట్టించు కోరుకూడా నిన్న  అనంతపురంలో చేపట్టిన కరువు సీమ దీక్షలో కాంగ్రెస్ పార్టీ గాలి తీసేశారు అంతేకాదు సీఎం చంద్రబాబునూ ఆడుకున్నారు.

అసలు కేబినెట్ లో ఎక్కడైనా సిఎమ్ లేదా పిఎం లకే వాల్యూ ఉంటుందట మిగతావారంతా విగ్రష పుష్టి , నైవేద్యనష్టియేనట. ఇక జేసి మాట్లాడటం మొదలెట్టారంటే ఆటో మేటిగ్గా ఆ టాపిక్ జగన్ పైకే వెలుతుంది. జగన్ ను విమర్శించడంలో కూడా జేసీ ఓన్ చేసుకుని మరీ ముద్దు ముద్దుగా తిడుతుంటారు. జేసీ పంచ్ లు మామూలుగా ఉండవు ఏపికి హోదా ఇస్తానని మాయమాటలు చెప్పిన కేంద్రం పైనా ఆయన నోరు చేసుకున్నారు. ఇది జేసీ స్టైల్ ఎదుటి వ్యక్తి  ఎంతటి వాడైనా జేసీకి బెదురు, నదురు ఉండదు ఎవడైతే నాకేంటి అన్నదే దివాకర్ స్టైల్.

English Title
JC Diwakar Reddy Punches

MORE FROM AUTHOR

RELATED ARTICLES