హస్తినలో చంద్రబాబు మంత్రాగం...

ఢిల్లీలో సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ నేతలందరితో వరుస భేటీలు నిర్వహిస్తూ ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఉదయం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాను వేర్వేరుగా కలిసిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం లక్నో వెళ్లి ఎస్పీ, బీఎస్పీ నేతలతో కూడా భేటీ అయ్యారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీయేతర ఫ‌్రంట్ ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పలు పార్టీల జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాను వేర్వేరుగా చంద్రబాబు కలిసిన చంద్రబాబు తాజాగా లక్నో వెళ్లి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత మాయావతిలతో భేటీ అయ్యారు.

జాతీయ నేతలతో వేర్వేరుగా భేటీ అవుతున్న చంద్రబాబు ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తున్నారు. ఎన్డీయేతర పక్షాలను బలోపేతం చేసేందుకు ఏఏ చర్యలు చేపట్టాలి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే అంశాలపై ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని ఇటీవల కలిసిన సందర్భంగా రాహుల్‌కు చంద్రబాబు ఇచ్చిన రిపోర్ట్‌లో కూడా పేర్కొనట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీయేతర ఫ్రంట్ ఏవిధంగా వ్యవహరించబోతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories