జయమ్ము నిశ్చయమ్మురా!

జయమ్ము నిశ్చయమ్మురా!
x
Highlights

కొన్ని సినిమాలు, ముఖ్యంగా హాస్య సినిమాలు ఎన్నో సార్లు చూసినా బాగానేవుంటాయి... అలంటి సినిమానే..ఈ జయమ్ము నిశ్చయమ్మురా. ఈ సినిమా 1989లో విడుదలైన ఒక...

కొన్ని సినిమాలు, ముఖ్యంగా హాస్య సినిమాలు ఎన్నో సార్లు చూసినా బాగానేవుంటాయి... అలంటి సినిమానే..ఈ జయమ్ము నిశ్చయమ్మురా. ఈ సినిమా 1989లో విడుదలైన ఒక విజయమంతమైన సినిమా. చిత్ర విచిత్రాలైన పాత్రలు సృష్టించి ప్రేక్షకులకు నవ్వు అనే యోగాన్ని అందించడంల సిద్ధహస్తుడైన జంధ్యాల, హాస్యపాత్రల హీరోగా విశిష్టమైన గుర్తింపు తెచ్చుకొన్న రాజేంద్ర ప్రసాద్‌ల కాంబినేషన్లో వెలువడిన ఈ సినిమా బాగా విజయవంతమైన హాస్యచిత్రాలలో ఒకటి. శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగు స్తంభాలాట వంటి సినిమాలలో హాస్యయుతమైన క్యారెక్టర్లను సృష్టించి ఆ పాత్రల డైలాగులను తెలుగు భాష నుడికారంలో భాగంగా చేసిన జంధ్యాల ఈ సినిమాలో అదే ఒరవడిని కొనసాగించాడు. ముఖ్యంగా కాంతం పాత్ర... ఈవిడ ఎవరైనా వారికి ఫలానాది ఇష్టం అని చెప్పగానే చనిపోయిన తన కొడుకుని గుర్తు చేసుకొని "నాన్నా... చిట్టీ" అని కౌగిలించుకొనటం. అప్పుడు భర్త గోపాలం ప్రదర్శించే హావభావాలు, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి...మీరు ఇప్పటివరకు ఈ సినిమా చూడకుంటే ... చూడండి...తప్పక ఎంజాయ్ చేస్తారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories