బెంగళూరు ముందుకెళ్లే దారులు మూసుకుపోయాయా?

బెంగళూరు ముందుకెళ్లే దారులు మూసుకుపోయాయా?
x
Highlights

ఐపీఎల్ లో ముందుకెళ్లే దారులు బెంగళూరుకు దాదాపు మూసుకుపోయాయి. సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌...

ఐపీఎల్ లో ముందుకెళ్లే దారులు బెంగళూరుకు దాదాపు మూసుకుపోయాయి. సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగుకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. మొదట కోహ్లి (8)ని, తర్వాత పార్థివ్‌ (28) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 49/2. ఈ దశలో డివిలియర్స్‌కు జతయిన మొయిన్‌ అలీ సిక్సర్లతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు 10.1 ఓవర్లలోనే ఇద్దరు కలిసి చకచకా 95 పరుగులు జోడించారు. డివిలియర్స్‌ 49 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలీ 31 బంతుల్లో (1 ఫోర్, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం మలింగ... అలీతో పాటు స్టొయినిస్‌ (0)లను ఒకే ఓవర్లో ఔట్‌ చేశాడు. డివిలియర్స్‌ (75; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (50; 1 ఫోర్, 5 సిక్స్‌లు) మంచి ప్రదర్శనే ఇచ్చారు.

మొత్తంగా బెంగుళూరు జట్టు 172 పరుగులు చేసింది. అయితే దురదృష్టం వారిని వెంటాడుతూనే ఉంది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ముంబై ఓపెనర్లు డికాక్‌ 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో జట్టు 4.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. వీళ్లిద్దరు పరుగు తేడాతో 71 స్కోరు వద్ద పెవిలియన్ కు చేరారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్‌ కిషన్‌ (9 బంతుల్లో 21; 3 సిక్సర్లు) ధాటిని కొనసాగించారు. ముంబై ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మంచి ప్రదర్శన ఇచ్చాడు. 19వ ఓవర్లో అతను వరుసగా 6, 4, 4, 6తో 22 పరుగులు చేయడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని అధిగమించింది. కాగా చహల్, మొయిన్‌ అలీ చెరో 2 వికెట్లు తీశారు. ఇక ఆర్సీబీ ఖాతాలో ఏడో ఓటమిగా నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories