పవన్‌ ఫ్లెక్సీలను చింపిన ఆకతాయిలు

Submitted by arun on Wed, 07/25/2018 - 17:11

పశ్చిమగోదావరిలో మరోసారి ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. భీమవరంలో పవన్‌ ఫ్లెక్సీలను ఆకతాయిలు ధ్వంసంచేశారు. పవన్‌ కల్యాణ్‌ బస చేసిన హోటల్‌కి కూతవేటు దూరంలో అభిమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చింపివేశారు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. తమ సహనాన్ని పరీక్షించొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలోనూ భీమవరంలో పవన్ ఫ్లెక్సీలు చింపివేయడంతో కేసులు నమోదయ్యాయి. పవన్‌ భీమవరం పర్యటనలో ఉండగానే ఇప్పుడు మరోసారి ఫ్లెక్సీలను ధ్వంసంచేయడంపై అభిమానులు ఫైరవుతున్నారు. 

English Title
Janasena Chief Pawan Kalyan Flex Controversy

MORE FROM AUTHOR

RELATED ARTICLES