గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్..

Submitted by nanireddy on Wed, 11/14/2018 - 19:21
janardhan-reddy-granted-bail-by-bengaluru-court-in-ponzi-scam-case-bond-set-at-rs-1-lakh-for-mining-baron

ఇటీవల అరెస్ట్ అయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది 
బెంగుళూరు కోర్టు. ఈ మేరకు లక్ష రూపాయల పూచికత్తు ఇద్దరు హామీతో ఆయనకు బెయిల్ మంజూరైంది. కాగా ఆండిడెంట్ చీటింగ్ కేసులో గత శనివారం మద్యాహ్నం నుంచి ఆదివారం మద్యాహ్నం వరకు గాలి జనార్దన్ రెడ్డిని దాదాపు 24 గంటల పాటు సీసీబీ పోలీసులు విచారణ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సీసీబీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసింది. అయితే అరెస్టు అయిన  జనార్దన్ రెడ్డికి మంగళవారం బెయిల్ రాకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. 

English Title
janardhan-reddy-granted-bail-by-bengaluru-court-in-ponzi-scam-case-bond-set-at-rs-1-lakh-for-mining-baron

MORE FROM AUTHOR

RELATED ARTICLES