సైలెంట్‌గా ఉండే జానారెడ్డిలో సడన్‌ ఛేంజ్

Submitted by arun on Thu, 07/05/2018 - 11:04

బేసిగ్గా ఆయన సైలెంట్ లీడర్. కానీ ఈసారి ఓపెన్ అయిపోయారు. తీవ్రదుమారం రేపుతున్న కత్తి మహేష్ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఎవరైనా విమర్శించినా పెద్దగా పట్టించుకోని జానారెడ్డి ఈసారి ఆయనే పట్టించుకొని మరి ఎందుకు తిట్టారు. ఎన్నడూ లేనిది సీఎల్పీ నేత జానారెడ్డిలో కోపం కట్టలు తెంచుకునేందుకు కారణమేంటి.? 

ఎవరు విమర్శించినా పెద్దగా పట్టించుకోరు అనవసర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు. చాలా కొన్ని అంశాలకే ఆయన స్పందిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఆయనంతట ఆయనే రియాక్ట్ అయ్యారు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జానా స్పందించారు. కాంగ్రెస్ తరఫున ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. 

చాలా అరుదుగా స్పందించే సీనియర్ లీడర్ జానారెడ్డి కత్తి మహేష్ కామెంట్స్‌పై ప్రెస్‌మీట్ పెట్టడం, అతడిని టెర్రరిస్టులతో పోల్చడం కత్తిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం ఇలా అన్ని విషయాలు రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాజకీయాల్లో ఇతరులను విమర్శించేందుకు సంకోచించే వ్యక్తిలో ఇలా సడన్‌గా మార్పు రావడంపై అంతా అవాక్కవుతున్నారు.

సెక్యులర్ పార్టీగా చెప్పుగానే కాంగ్రెస్ నాయకులు ఇలా రాముడి విషయంలో స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాంగ్రెస్ అధినేత రాహుల్ కూడా తాను గొప్ప శివభక్తుడినంటూ చెప్పుకొచ్చారు. జానారెడ్డి కూడా రాహుల్‌ను ఫాలో అవుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ హిందువుల పక్షాన కూడా ఉందనే విధంగా సంకేతాలు ఇచ్చేలా జానా మాట్లాడినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

English Title
Jana Reddy Warning To Kathi Mahesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES